తెలంగాణ

ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలి: జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్

ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలి: జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లా డి ఏ ఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించిన వీక్లీ పరేడ్‌లో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ పాల్గొని పోలీస్ సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్‌ను పరిశీలించారు. పోలీస్ విధులు సమర్థవంతంగా నిర్వహించాలంటే క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం కూడా ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలిపారు.పోలీసులు నిత్యం ప్రజల భద్రత కోసం బాధ్యతతో పనిచేస్తుంటారని, అందుకు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ఎస్పీ సూచించారు. విధులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యక్తిగత లేదా విధులకు సంబంధించిన సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విధులతో పాటు కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఉపేందర్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు మల్లేష్, గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, సమ్మయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రామ్ నిరంజన్ రావు, శేఖర్, శ్రీపాల్, రామకృష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో ఏ ఆర్ సిబ్బందితో పాటు నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్, నిర్మల్ రూరల్ సర్కిల్, సోన్ సర్కిల్, డి సి ఆర్ బి, ఐటి కోర్, ఎస్ బి సిబ్బంది, పి సీ ర్, షీ టీమ్, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS