ప్రతి గ్రామం ఆరోగ్య గ్రామంగా ఉండాలన్నదే మోదీ లక్ష్యం
పయనించే సూర్యుడు ,సెప్టెంబర్24: ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం ద్రాక్షారామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డా.రత్నసుధ,ఆరోగ్య సిబ్బంది ద్రాక్షారామ సచివాలయం-1లో మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి మండల అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని,ప్రతి గ్రామం ఆరోగ్య గ్రామంగా ఉండాలన్నదే మోదీ లక్ష్యమని అన్నారు.అందరికీ వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో ప్రతి గ్రామంలో నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పుల్లెల రామమూర్తి,ఉపాధ్యక్షులు దక్షిణామూర్తి,ఆర్ఎస్ఎస్ నాయకులు బివిబిఎల్ నారాయణ,ఏఎన్ఎం,ఎంఎల్హెచ్పి,ఆశాలు,హెల్త్ అసిస్టెంట్,హెల్త్ విజిటర్,అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.