ఆంధ్రప్రదేశ్

లక్కవరంలో దీన్ దయాల్ జయంతి వేడుకలు

లక్కవరంలో దీన్ దయాల్ జయంతి వేడుకలు

పయ నుంచే సూర్యుడు సెప్టెంబర్24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.బిజెపి బూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరని,ఏకాత్మ మానవతావాదం,అంత్యోదయ సిద్ధాంతంతో పేదవాడి అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు.ఆయన చూపిన మార్గంలోనే బిజెపి పనిచేస్తోందని,ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ఇంటింటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా,శృంగారపు సూర్యప్రకాశ్ రావు,మంగన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS