ఆంధ్రప్రదేశ్

మురుమళ్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదికవినతులు స్వీకరించిన ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజ

మురుమళ్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదికవినతులు స్వీకరించిన ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజ

పయనించు సూర్యుడు సెప్టెంబర్ 25 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం మురుమళ్లలోని శాసనసభ్యుల కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి,వాటిని సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపించాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు.వెంటనే పరిష్కరించదగిన సమస్యలపై సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చేయించారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రతి సమస్యను పరిష్కరించే వరకు వదిలిపెట్టనని, ప్రజా సేవకే అంకితమై పనిచేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గుత్తుల సాయి,ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు,జనసేన నాయకులు గోదాడ జమ్మి తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS