పయనించే సూర్యుడు, జనవరి 31, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు అంగన్ వాడి సెంటర్ ను బిజెపి పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు.
ఆదోని మహాత్మా గాంధీ నగర్ లో ఉన్న అంగన్ వాడి సెంటర్ ను పర్యవేక్షించి కేంద్ర ప్రభుత్వం పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న పౌష్టిక ఆహారం సక్రమంగా అందించాలని నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలని మాట్లాడటం జరిగింది.అలాగే సెంటర్ కి సంబందించిన రికార్డులో కూడా కొన్ని తప్పులను సరిచేసుకోవాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ నాయకులు ఉరుకుంద గౌడ్, యువమోర్చ నాయకులు వినోద్ కుమార్ బిజెపి నాయకులు పగడాల కిరణ్, పరమేష్ పాల్గొన్నారు.