
శిథిలావస్థకు చేరుతున్న అంగన్వాడీ కేంద్రం…
ఫోటో : అంగన్వాడీ భవనానికి పగుళ్ళు ఏర్పడిన దృశ్యం…
రుద్రూర్, జనవరి 17 (పయనించే సూర్యడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రానికి పగుళ్ళు ఏర్పడి శిథిలావస్తకు చేరిందని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాలనీవాసులు, చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో 13 మంది చిన్నారులు ఉంటారు. నూతన అంగన్వాడీ భవనం సాంక్షన్ అయినా కూడా పనులు ఇంకా ప్రారంభించకపోవడంతో, పగుళ్ళు ఏర్పడి శిథిలావస్తకు చేరిన అంగన్వాడీ కేంద్రంలోనే చిన్నారులకు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నూతన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను ప్రారంభించాలని కాలనీవాసులు, చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.