Saturday, February 1, 2025
Homeఆంధ్రప్రదేశ్అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనం కరువు అసంపూర్తిగా అంగన్వాడి భవనాలు సొంత భవనాలు లేక అరకొర...

అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనం కరువు అసంపూర్తిగా అంగన్వాడి భవనాలు సొంత భవనాలు లేక అరకొర వసతులు నిధులు రావు పనులు కావు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 31

వార్త విశ్లేషణ జిల్లా కేంద్రాల్లో అనేక అంగన్వాడి కేంద్రాలు సొంత భవనాలు లేక అరకొర వసతులు అద్దె భవనాల్లో కొట్టుమిట్లుడుతున్నాయి ఉన్న అంగన్వాడి కేంద్రాల్లో కొన్ని అధ్యె భవనాల్లో మరికొన్ని ప్రాథమిక పాఠశాలలో కొన్ని శాశ్వత భవనాల్లో నడుస్తున్నాయి అయితే ఆశించిన మేర సొంత భవనాలు లేక ఐసీడీఎస్ లక్ష్యం నీరుగారుతోంది అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులు,గర్భిణీలు,బాలింతలు,తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, కొన్ని అంగన్వాడి కేంద్రాల్లో పరిస్థితులు మరి దారుణంగా తయారయ్యాయి,సొంత భవనాలు అదిరిపోయే హంగులతో చిన్నారులకు ఆహ్లదకరమైన వాతావరణం అందించేలా అంగన్వాడి కేంద్రాలు ఉండాలని ఆ శాఖ నిర్ణయించినప్పటికీ అమలుకు నోచుకోవడం లో తీవ్ర జాప్యం జరుగుతోంది కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం బడ్జెట్ లోపం వెరేసి అంగన్వాడీలు సమస్యల వలయాలో చిక్కుకుంటున్నాయి సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శాంక్షన్ అయి పది సంవత్సరాలు అయితుంది పనులు మాత్రం ఇంకా పూర్తి కావట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మాణాం పనులు తక్షణమే కంప్లీట్ చేయాలని ఈ బిల్డింగ్ ఎస్సీ కాలనీకి శాంక్షన్ అయింది దీంతోపాటు శాంక్షన్ అయిన బిల్డింగ్స్ పనులు కంప్లీట్ అయి వాటిలోనే కొనసాగిస్తున్నారు ఈ బిల్డింగ్ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు పై అధికారులు ఈ అంగన్వాడి స్కూలు మీద దృష్టి పెట్టాలని ఎస్సీ కాలనీ వాసులంతా కోరుతున్నారు ఈ బిల్డింగు పశువుల పాకలాగ మారింది ఈ బిల్డింగ్ లో పశువులను కట్టేయడం గడ్డి వేయటం జరుగుతుంది మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే డిపార్ట్మెంటు తక్షణమే స్పందించి ఈ అంగన్వాడి బిల్డింగు పనులు పెండింగ్ ఏదైతే ఉన్నాయో వెంటనే పూర్తి చేసి అంగన్వాడి బిల్డింగ్ ని వాడుకోవడానికి అప్పగించాల్సిందిగా కోరుతున్నారు చిన్నపిల్లలకు గర్భిణీలకు బాలింతలకు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అంగన్వాడి కేంద్రాల పరిస్థితి ఏర్పడిందని అంగన్వాడి భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పథకాలైన ఎంజినరేగా,రూరల్ ఇన్ఫ్రాట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్)ఏపీఐపీల ద్వారా నిధులు కేటాయిస్తారు రాష్ట్రస్థాయిలో జిల్లా పరిషత్ ఫండ్ నుంచి 15 శాతం మండల పరిషత్ ఫండ్ నుంచి 15 శాతం తీర్మానాలు చేసి పరిమిత బిల్డింగులకు కేటాయిస్తుంటారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతో రాష్ట్ర పరిధిలోని పంచాయతీరాజ్ ఏఈలు నిర్మాణ పనులు చేపడతారు సంబంధిత శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అంగన్వాడి బిల్డింగు నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments