Tuesday, April 22, 2025
Homeఆంధ్రప్రదేశ్అందరూ ఇసుక దొంగలే....!

అందరూ ఇసుక దొంగలే….!

Listen to this article

అధికార పార్టీ నాయకులు…పాత్రికేయులు సూత్రధారులే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇంచార్జ్ పయనించే సూర్యుడు జనవరి 31యూసఫ్
అక్రమార్కులతో అధికారులు కుమ్మక్కు

గోదావరి…కిన్నెరసాని ప్రాంతాలను పంచుకున్న ఇసుక దొంగలు

బూర్గంపాడు :
బూర్గంపాడు మండలంలో గోదావరి, కిన్నెర సాని నది ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలించేందుకు అటు అధికార పార్టీ నాయకు లు…ఇటు పాత్రికేయ వృత్తిలో ఉన్న కొందరు పంచుకున్నారు.. మండలంలో ఏకంగా పది ప్రాంతాలలో ఇసుక అక్రమంగా తరలించేందుకు ర్యాంపులను సైతం ఏర్పాటు చేసుకొని రెవెన్యూ, పోలీసు అధికారుల అండదండలతో ఇసుకను తరలిస్తూ దర్జాగా మూడు పూవులు ఆరు కాయలుగా ఈ దందాను కొనసాగిస్తున్నారు.ఈ అక్రమ వ్యవహారాన్ని నియంత్రించాల్సిన పోలీస్, రెవిన్యూ శాఖ యంత్రాంగం సైతం చూసీ చూడనట్లుగా.. అమ్యామ్యాలకు అలవాటు పడి పట్టించుకోవడంలేదని విమర్శలు బలంగా వినబడుతున్నాయి. ఇందుకు సంబంధించి విశ్వ జ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం…

అధికార పార్టీ నాయకులు…పాత్రికేయులు సూత్రధారులే:
ఇసుకకు వున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ నాయకులు కొందరు గోదావరి, కిన్నెరసాని నదీ ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.. ఇదే సమయంలో ఈ అక్రమాన్ని బాహ్య ప్రపంచం కి వెలుగులోకి తేవలసిన పాత్రికేయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రా నిక్ మీడియాకు చెందిన కొందరు అక్రమ ఇసుక వ్యాపార అవతారమెత్తారు… బూర్గంపాడు,సారపాక, సోంపల్లి.లక్ష్మీపురం. మోరంపల్లిబంజర, పినపాక గ్రామాలకు చెందిన పాత్రికేయ వృత్తిలో ఉన్న కొందరు రాత్రిపూట ఇసుక దొంగల అవతారం ఎత్తి తమ వృత్తికే మచ్చ తీసుకొస్తున్నారని ఆక్షేపణలు బలంగా వినబడుతున్నాయి. మండలంలోని ఉప్పుసాక,పాత పినపాక,బుడ్డగూడెం సోంపల్లి,బూర్గంపాడు సారపాక,
తాళ్లగుమ్మూరు, సారపాక గోదావరి తీర ప్రాంతాల్లో దర్జాగా రాత్రి 10 గంటల నుంచి ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇసుకను తరలించేందుకు జెసీబీల వాడుతూ ట్రాక్టర్లు, లారీలు ద్వారా మరోచోటకు తరలించి రాత్రిపూట నిల్వ ఉంచుతున్నారు.రాత్రికి రాత్రికి అక్రమంగా ఈ ఇసుకను విక్రయిస్తూ తమకు పోటీ ఎవరు లేరు…..తమను ఎవరూ ఆపలేరు….అనే రీతిగా పాత్రికేయు ముసుగులో ఉన్న కొందరు ఇసుక దొంగలు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీలోని పేరు గడించిన కొందరు నాయకులు మేము సైతం అంటూ ఇసుక అక్రమంగా తరలించేందుకు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అభయ హస్తంతో రెవిన్యూ, పోలీస్ అధికారులను మచ్చిక చేసుకొని రాత్రిపూట ఇసుక దొంగల అవతారంలో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన మహిళా కాంగ్రెస్ మణులు కూడా ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

అమ్యామ్యాలతో అధికారులు…!
అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు… పాత్రికేయ వృత్తిలో ఉన్న కొందరు….ఇసుకను అక్రమంగా తరలించి అక్రమార్జనకు పాల్పడు తున్నా… నియంత్రించాల్సిన అధికారులను అమ్యామ్యాలతో సరిచేస్తున్నారని ప్రచారం సాగుతోంది.ఈ అధికారులు సైతం జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి సూచన మేరకే తాము చేస్తున్నట్లు ఒకపక్క చేపుతూనే అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారి వద్ద నుంచి దర్జాగా సొమ్మును వసూలు చేస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. బూర్గంపాడు మండలంలో కొంతకాలంగా కొనసాగుతున్న ఇసుక అక్రమ వ్యవహారాన్ని జిల్లా అధికార యంత్రం ఇకనైనా పట్టించుకోకపోతే విచ్చలవిడిగా రాత్రిపూట ఈ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందే అవకాశాలు కూడా లేకపోలేదు.జిల్లా కలెక్టర్ ఈ మండలంలో జరుగుతున్న ఈ తరహా అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments