
ఆత్మకూరులో పక్షం రోజుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
త్వరలోనే కొత్త ఆసుపత్రి కి అనుమతులు
*మక్తల్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి
పయనించే సూర్యుడు న్యూస్. మక్తల్ జనవరి18 ఆత్మకూర్ :ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మక్తల్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజు గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే గారు ఆత్మకూరులోని స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి వైద్యులు మరియు సిబ్బంది లేకపోవడాన్ని అసహనం వ్యక్తం చేశారు.పక్షం రోజుల్లో డయాలసిస్ కేంద్రం ప్రారంభం… ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో పక్షం రోజుల్లోగా రూపాయలు మూడున్నర కోట్ల నిధులతో డయాలసిస్ కేంద్రము ఏర్పాటు చేస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి సరిహరి ప్రకటించారు. ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు వచ్చాయని ఈనెల 21వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆత్మకూరు పట్టణానికి విచ్చేస్తున్నారని వెల్లడించారు. పట్టణ శివారులోని బిజెపి క్యాంపులో కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. రూపాయలు 18 కోట్లతో 50 పడకల ఆసుపత్రికి ప్రతిపాదనలు చేపడుతున్నామని తెలిపారు. రూపాయలు 35 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎండి రహమతుల్లా , తులసిరాజ్ యాదవ్ , అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.