పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 1,అశ్వాపురం ప్రతినిధి, అశ్వాపురం మండలం మండుకుంట గ్రామానికి చెందిన, సిపిఐ మండల సీనియర్ నాయకులు,గణేశుల అమ్మాజీ గారు మరణించిన విషయం తెలుసుకుని ఈ రోజు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి అరుణ పతాకం కప్పి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసి, ఎన్ని ఒడిదడుగులు వచ్చిన కమ్యూనిస్టు పార్టీలోనే వారి జీవితాంతం పనిచేశారు,, వారి సేవలు కమ్యూనిస్టు పార్టీ మర్చిపోలేదు, వారి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరంలోని లోటు అని, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య అన్నారు, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, సిపిఐ అశ్వాపురం మండలం కార్యదర్శి అనంతనేని సురేష్, నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్, కమటం సురేష్, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు, కొండపర్తి ప్రసాద్, దంతాల జగదీష్, దండి నాగేష్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు,రాయపూడి రాజేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపెల్లి పవన్ సాయి, మొండికుంట బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, సర్వ కృష్ణ, పశుల ప్రభాకర్, పూర్వం సంతోష్, ప్రజాప్రతినిధులు,సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమ్మాజీ అకాల మరణం సిపిఐ పార్టీకి తీరనిలోటు.
RELATED ARTICLES