
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్
//పయనించే సూర్యుడు //న్యూస్// జనవరి29 //మక్తల్// అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ లోని విశ్రాంతి గృహం నందు రెండు రోజుల క్రితం ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించడం జరిగింది.ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ అధ్యక్షులు పృధ్విరాజ్ మాట్లాడుతూ ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డులకు ఎంపిక చేయవలసిందిగా ఆదివాసి దళిత బహుజన పేద ప్రజల ఆత్మగౌరవ పోరాట కెరటం, తెలంగాణ ఉద్యమకారుడు అయినా గద్దర్ పేరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.ఈ నేపథ్యంలో గద్దర్ కి పద్మశ్రీ అవార్డు ఎందుకు రాలేదు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారిని విలేకరి ఒకరు అడగగా గద్దర్ కి మేము అవార్డు ఎట్లిస్తాం. మేము ఇవ్వం, ఆయన భావజాలం ఏమిటి? బిజెపి కార్యకర్తలు చంపించిన అతడికి మేము ఇవ్వం! మేము ఎవరికీ భయపడం అని తన పిరికితనాన్ని బయట పెట్టుకున్న పిరికి సన్యాసి బండి సంజయ్ అని అన్నారు.తన మాట పాటలతో పీడితుల హక్కుల సాధనకకై పెత్తందారుల మీద గళమెత్తేలా చైతన్యాన్ని నింపాడాని,ఈ క్రమంలో రాజ్యం తనపై కాల్పులు జరిపి తూటాలు దించినా.లాల్ నీల్ అంటూ బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారానికి కృషి చేసిన మహానీయుడు గద్దర్ అని అలాంటి మహనీయుడికి ప్రజలిచ్చిన ప్రజా యుద్ధనౌక బిరుదు ముందు మీలాంటి మతోన్మాద ప్రభుత్వాలు స్వార్థ బుద్ధితో ఇచ్చే అవార్డులు ఏమాత్రం సరితూగవని ప్రజలందరూ అనుకుంటారని కానీ.మిమ్మల్ని బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించిన అగ్రకుల ఆధిపత్య భావజాలాన్ని,వారి చెప్పులు మోసే నీలాంటివారికి గద్దర్ భావజాలం గూర్చి గాని ఆయన ప్రజల కోసం చేసిన గూర్చి ఎట్లా తెలుస్తుందిలే* అని తీవ్రంగా ఉద్గాటించారు.అంతే కాకుండా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా అంటూ ఉద్యమాన్ని ఉర్రూతలగించి… తెలంగాణ రాష్ట్ర సాధనను సహకారంలో ప్రముఖ పాత్ర పోషించిన గద్దర్ గారి పట్ల మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెన్నక్కి తీసుకొని మరియు క్షమాపణ కోరాలని అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ లో డిమాండ్ చేస్తున్నం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులు బండారి వెంకటేష్, సహాయ కార్యదర్శి రవికుమార్, కార్యవర్గ సభ్యులు కర్రెమ్ ఆంజనేయులు పాల్గొన్నారు.