
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 20:- రిపోర్టర్ (కే. శివకృష్ణ) ఆప్కాస్ ను రద్దుచేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించాలని ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించాలని కోరుతూ బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ కి మరియు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు పార్థసారథి కి వినతి పత్రం అందజేయడం జరిగినది. గతంలో కాంట్రాక్టర్లు సక్రమంగా వేతనాలు చెల్లించకపోవడం రెన్యువల్ కి డబ్బులు వసూలు చేయటం పిఎఫ్ ఈఎస్ఐలు సక్రమంగా జమ చేయకుండా ఔట్సోర్సింగ్ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో ఆప్కాస్ ఏర్పడిన తరువాత ఈ సమస్యలు లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నాము ఆప్కాసన రద్దు చేయబోతున్నారన్న వార్తలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ అనుచితిని ప్రభుత్వం తొలగించాలి మీరు పై అంశాలను పరిశీలి క్రింది సమస్యలను పరిష్కారానికి తగు చర్యలు చేపట్టమని విజ్ఞప్తి చేస్తున్నాము.ఆప్కాసన కొనసాగించాలి .వివిధ శాఖలు పై సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ మరియు ప్రభుత్వ పథకాలలోని అన్ని క్యాడర్ల ఉద్యోగులకు మినిమం టైమ్స్ కేల అమలు చేయాలి ఒకే పథకంలో అన్ని క్యాడర్లకు ఒకే వేతనం అమలు చేయాలి.ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.ప్రతి ఆరు నెలలకు కరువు భత్యం చెల్లించాలి సిక్కిలివ్వులు అమలు చేయాలి.కారుణ్య నియామకాలు ఇవ్వాలి.హెచ్ఆర్ఏ పాలసీని అమలు చేయాలి.