Sunday, April 20, 2025
HomeUncategorizedఇది రైతు వ్యతిరేక బడ్జెట్ బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసిన సిపిఐ పార్టీ నాయకులు

ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసిన సిపిఐ పార్టీ నాయకులు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ తాడిపత్రి ప్రతినిధి కుళ్లాయప్ప: 6 : సిపిఐ సిపిఎం రైతుసంఘము అద్వర్యంలో పెద్దవడుగూరు మండల కేంద్రములోని గాంధీ సర్కిల్ నందు బడ్జెట్ ప్రతులనుధగ్దము చేయడము జరిగింది ముఖ్య అతిథులుగా సిపిఐ సీనియర్ నాయకులు వైసూర్యనారాయణరెడ్డి రైతు సంఘం జిల్లా ఉఫాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్ సీపీఐ సీనీయర్ నాయకులు నారాయణసీపీఎం నాయకులుఈశ్వరరెడ్డి పాల్గోని మాట్లాడుతూమోడీ ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో మాదిరి ఈ సంవత్సరం కూడా రైతులకు అన్యాయం చేయడం జరిగింది ఎందుకనగా 2014 ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే వ్యవసాయ ఆదాయాన్ని 2020సంవత్సరానికి రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసి అధికారములోకి రావడం జరిగింది కానీ ఇంతవరకు రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదు ప్రతి బడ్జెట్లో కార్పొరేట్ రంగానికి అనుకూలంగానే వ్యవహరించడంజరుగుతున్నదని ఈ బడ్జెట్లో కూడ పంటలకు మద్దతు ధరలు అంశం లేదని రైతులు ప్రత్యేక సాగు చేసి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే వారికి ఋణాలు మాఫీ చేయాలి అన్న అంశంపై కూడా ఆలోచన కూడా చేయలేదు వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని రంగాలకు అధిక నిధులు కేటాయిస్తామని ఎరువుల సబ్సిడీ నిధులు ఊసే లేదు ప్రధానమంత్రి ఫసల్ బీమా నిధులు కేటాయింపులు కోతలు, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే పంట రుణాలు మూడు నుండీ అయిదులక్షల వరకు పెంచుతామని మాటలకే పరిమితం రైతులకుక్రెడిట్ కార్డు లుఇచ్చిన పరిస్థితి కూడా లేదు రాయలసీమ జిల్లాకు హార్టికల్చర్ హబ్ ను ఏర్పాటు చేసే నిధుల పైన ఊసే లేదు పిఎం కిసాన్ సన్మాన్ నిది 6000 నుంచి 12000 కు పెంచుతామన్న అంశం కూడా బడ్జెట్లో ప్రస్తావనే లేదు ప్రభుత్వమే వేసిన స్వామినాథన్ కమిటీ సిఫార్సులు సీ2+50 ఆధారంగా మద్దతు ధరల చేయడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కౌలు రైతులు కష్టపడి సాగుచేస్తుంటే వారికి గుర్తించి ఋణాలు,రైతు సంక్షేమఫలాలుపై ఊసేలేదు ఇప్పటికైనా రైతుల పైన ఏమాత్రం ఆదుకోవాలని చిత్తశుద్ది ఉంటే సాగు త్రాగునీరు ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించాలి రైతులు పండించే అన్ని పంటలకు ఉచిత పంటల భీమా విధానానికి అధిక నిధులు కేటాయించాలని కేంద్రప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం .ఈ కార్యక్రమములో రైతుసంఘము నీయోజకవర్గఅద్యక్ష కార్యదర్శులుఆదినారాయణఓబిరెడ్డిమండలసహయకార్యదర్శి, రంగస్వామిఅల్లాబకాష్ ఎఐటీయుసి నాయకులుఉసేన్ పీరాకిరణ్ అంజి శ్రీనివాసరెడ్డిముత్యాలరెడ్డినారాయణస్వామిషేక్షావలితదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments