
పయనించే సూర్యుడు జనవరి 29 గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ సిద్దిపేట జిల్లా
గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ.పీజీ కళాశాల లో.బుధవారము. రోజున అటానమస్ లోని టీ.ఎస్. కె .సి . కెరియర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించరూ ఈ కార్యక్రమానికి ఇండియన్ ఫారెన్ ఫర్ బెటర్ సొసైటీ ఎన్జీవో ఆర్గనైజేషన్ చైర్మన్ బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో నైపుణ్యాలు కలిగిన విద్యార్థిని విద్యార్థులకు పుష్కలమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. నేటి యువత కొన్ని రకాలైన నైపుణ్యాలను అలవర్చుకుంటే మంచి ఉద్యోగాన్ని పొంది ఉత్తమమైన జీవితాన్ని అనుభవించొచ్చు అన్నారు. నేటి ప్రపంచం ఈ మధ్యకాలంలో ఏ.ఐ టెక్నాలజీ మీద ఆధారపడిందన్నారు. ఆ టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించుకుంటే ప్రపంచవ్యాప్తంగా విస్తారమైన ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల విషయంలో కూడా విద్యార్థులు జాగరుగత్తతో నాలెడ్జ్ని సంపాదించుకోవాలన్నారు. తెలివితేటలను కేవలం పురాతన, సాంప్రదాయ పద్ధతిలో కాకుండా నైపుణ్య పద్ధతిని అలవర్చుకుంటే ఉద్యోగాలు పొందడం విద్యార్థులకి పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఈ నైపుణ్యాలను సంపాదించుకోలేని విద్యార్థులు ఏ చిన్నపాటి ఉద్యోగ, ఉపాధి అవకాశాన్ని కూడా పొందలేకపోతున్నారన్నారు. విద్యార్థులు ఎవరైనా సెంట్రల్, స్టేట్, ఆర్ . బి.ఐ., ఎస్బిఐ, డి.సి.సి.బి, నాబార్డ్, ఎల్.ఐ.సి, ఆర్.ఆర్.బి, ఆర్మీ ,యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ టీచింగ్, ప్రభుత్వం, ప్రైవేట్ తదితర రంగాలలో ఉద్యోగాలు సంపాదించడానికి అవసరమైన శిక్షణను మా సంస్థ తరఫున ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులు తాము ఇచ్చే శిక్షణ ద్వారా మంచి భవిష్య�