
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 7. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ .గుగులోత్ భావుసింగ్ నాయక్.ఖమ్మం జిల్లా లో ఉన్నటువంటి 20 మండలాలకు సంబంధించి సత్తుపల్లి లటికే లక్ష్మణరావు, ఆర్.టి.ఐ -2005 యాక్టివిస్ట్ సొసైటీ ఖమ్మం జిల్లా పొలిటికల్ కన్వీనర్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కు దరఖాస్తు నిమిత్తం
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో వైన్ షాపులు సిండికేట్ గా మారి చేస్తున్న అక్రమాలు – తగు చర్యలు తీసుకొనుట గురించిసత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లైసెన్స్ పొందిన వైన్ షాపుల వారు సిండికేట్ గా మారి తమ ఇష్టానుసారం వైన్ షాపులలో కొన్ని రకాల మద్యం మాత్రమే అమ్మకాలు సాగించడం -బెల్టు షాపుల ద్వారా అధిక ధరలకు అన్ని రకాల మద్యం అమ్మకాలు సాగించడం వల్ల సామాన్యుడు మానసిక, శారీరక ఉపశమనం కోసం మద్యం కొనే సందర్భంలో ఈ క్రింది సమస్యలు ఎదుర్కొంటూ ఆర్ధికంగా నష్టపోతున్నాడు.ఆ అనుమతి పొందిన వైన్స్ షాపులు/ బార్లలో కొన్ని రకాలు మాత్రమే అమ్ముతున్నారు గ్లాసులు, వాటర్ పాకెట్స్, తినుబండారాల పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారు.వైన్స్ / బార్ షాపులను మరిపిస్తున్న అనుమతి లేని బెల్టు షాపులు – బెల్టు షాపులలో అన్నిరకాల వైన్స్ అందుబాటులో వుంచి, అధిక ధరలకు అమ్ముతున్నారు మద్యం వివరాలు, రేట్లు తెలియజేసే విధంగా బెల్టు షాపులలో బోర్డులు ఏర్పాటు చేయాలి.బార్ షాపులలో అదనంగా డబ్బులు తీసుకొని ఫుల్ బాటిల్స్ బార్ కోడ్ తీసి అమ్ముతున్నారు.అనుమతి లేని చోట అక్రమంగా ‘సిట్టింగ్’ వేసి మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.కావున తమరు దయతో పై విషయము పరిశీలించి, సత్తుపల్లి లో మద్యం విక్రయాలలో అక్రమాలకు పాల్పడుతున్న వైన్ షాపులు, బార్ షాపులు, బెల్టు షాపుల యజమానులపై తగు చర్యలు తీసుకొనగలరని డిమాండ్ చేయడం జరిగింది వైన్ షాపులు నడుపుతూ ప్రముఖ పత్రికల్లో కొందరు విలేకరులుగా చలామణి అవుతూ అధికారుల ను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం . ఇదేమని అడిగితే ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు అనే విషయం జిల్లావ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వైరా సత్తుపల్లి సింగరేణి ఎక్సేంజ్ శాఖ సిఐ లుగా విధులు నిర్వహిస్తున్న అధికారులు బెల్ట్ షాపులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అధికారుల ప్రలోభంతో బెల్ట్ షాపులు యదేచ్ఛంగా నడుస్తున్నట్టు ఖమ్మం జిల్లా ప్రజలు గుసగుసలు వీటి పైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు సంఘ నాయకులు నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు వారి పైన చర్యలు తీసుకోకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడికి కార్యాచరణ చేపట్టే అవకాశం ఉందని ఈ సభ లో తెలియజేయడం జరిగింది