
పయనించే సూర్యుడు//జనవరి 17//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి//కుమార్ యాదవ్..
హుజురాబాద్ పట్టణంలో హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే ని పాడి కౌశిక్ రెడ్డి, దిష్టిబొమ్మను, గాడిద మీద ఊరేగించిన, కాంగ్రెస్ హుజురాబాద్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మరియు కాంగ్రెస్ నాయకులు… ఈ సందర్భంగా హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని నోరు అదుపులో పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే , భౌతికంగా దాడులు చేయడం తద్యమని హెచ్చరించారు. ఇకనైనా రౌడీయిజం అనేది మానుకో, అని మంత్రుల మీద కానీ, ప్రణవ్ మీద కానీ, మాట్లాడితే సహించేది లేదని, ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న అన్నారు. నీ స్థాయి గాడిద లాంటిది, అనుకుంటూ.. చీర గాజులు పూలు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకి, అలంకరణ చేసి, గాడిదపై ఊరేగింపు చేశాము అన్నారు. ఇకనైనా తస్మాత్ జాగ్రత్త బిడ్డ అని, హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు