
ప్రజా పక్షం, అశ్వాపురం :
అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ వరప్రసాద్ అధ్యక్షతన గ్రామపంచాయతీ ఎన్నికల కొరకు వార్డులవారిగా సప్లమెంటరీ ఓటర్ల జాబితాలో మార్పులు,చేర్పుల లిస్ట్ తెలియయుటకుకు గాను మండల స్థాయి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ వివరాలను ఎంపీ ఓ ముత్యాలరావు వివరిస్తూ అశ్వాపురం మదర్ రోల్ నుండి మొత్తంగా 32,920 ఓట్లు ఉండగా సప్లిమెంటరీ 1 నుండి 386 ఓట్లు కొత్తగా వచ్చాయని అనంతరం ప్రస్తుతం సప్లమెంటరీ 2 నుండి 269 ఓట్లు కొత్తగా వచ్చాయని మొత్తంగా 33,563 ఓట్లను పరిగణలో తీసుకొని ఆయా రాజకీయ నాయకులకు ఆ యొక్క లిస్టులను అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ పద్మావతి, మండల పరిషత్ అధికారులు, మండలంలోని అన్ని పార్టీల రాజకీయ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.