పయనించే సూర్యడు ఫిబ్రవరి 01 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు: నడిగూడెం కెఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల నమోదును కోరుతూ రూపొందించిన కళాశాలలో సౌకర్యాలతో కూడిన కరపత్రాలను శనివారం కళాశాల ప్రిన్సిపల్ డి విజయ నాయక్ ఆవిష్కరించారు ఉచిత విద్య ఉచిత పుస్తకాలతో పాటు కళాశాలలో ఉన్న వసతులను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కల్పిస్తున్న ఇంటర్ ఉచిత ప్రదేశాలను 10వ తరగతి విద్యార్థులు అందుకోవాలని ఈ సందర్భంగా కోరారు కళాశాలలో నాలుగు సాధారణ కోసులతోపాటు వృత్తి విద్యా కు సంబంధించిన ఆరు గ్రూపులలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో చేరేందుకు అవకాశం ఉందన్నారు పరిసర గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.