Friday, January 31, 2025
Homeతెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది: జగదీశ్వర్గౌడ్

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది: జగదీశ్వర్గౌడ్

Listen to this article

శేరిలింగంపల్లి,జనవరి 30 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్)

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ సంవత్సరపు జిహెచ్ఎంసి నిధులు
అని శాఖల సమన్వయంతో పనులు చేపట్టాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య
మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి,గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కి,రంగారెడ్డి జిల్లా మంత్రి దు
ద్దిల శ్రీధర్ బాబు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మరియు జీహెచ్ఎంసి మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నేడు ప్రవేశపెట్టిన గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ సమావేశంలో నిధుల కేటాయిం పుపై ప్రతి అంశంపై క్లుప్తంగా మాట్లాడి శేరిలింగంపల్లి అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని నగర మేయర్ ని కోరిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,మాదాపూర్ డివి జన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొనే డ్రైనేజ మరియు మంచినీటి సమస్య పరిష్కారానికి,సీసీ రోడ్డు ఇతర మౌళిక వసతుల సమస్యలపై అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో పనిచేయాలి.

ప్రజలు కష్టపడి సంపాదించిన స్థలంలో ఈరోజు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోతుంది.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలాల అభివృద్ధి పనులు చేపట్టాలి.

దళారులు,టౌన్ ప్లానింగ్ సిబంది ప్రజ
లను ఎంతో ఇబంధులు గురిచేస్తున్నారు.

యూ.సి.డి డిపార్ట్మెంట్ (ఆర్పీ,సమైక్య మహిళ గ్రూప్) అభివృద్ధి కొరకు రూ. 17.00కోట్లు మంజూరు చేయడం
చాలా సంతోషం. రోడ్లు,బ్రిడ్జి,సీ.ఆర్.ఎం.పి,ఫూట్
ఓవర్ బ్రిడ్జి నిధులు మంజూరు.

నూతన స్ట్రీట్ లైట్లు ఏర్పాటు సంతో షకారం,మరిన్ని స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలి,వాటి మరమ్మతులు చేపట్టాలి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్కుల అభివృద్ధి కోరారు కేటాయించిన నిధులు సక్రమంగా అమలు చేసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉన్న అనేక పార్కుల అభివృద్ధి వాటి పరిరక్షణ కోసం కృషి చేయాలి.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అనేక డివిజన్ కాలనీలో ప్రజలు నూ
తన పోల్స్,స్ట్రీట్ లైట్లు,కేబుల్ అడగడం జరుగుతుంది.

అధికారులు మాత్రం పోల్ ఉంటే లైట్లు లేవని,లైట్లు ఉంటే కేబుల్ లేదు అని చెప్ప డం జరుగుతుంది,కనుక ఈ నిధులు సక్రమంగా అమలు అయ్యేలా చూడాలి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టాక్స్ అస్సెస్మెంట్ చేయడం ద్వారా జి.హె చ్.ఎం.సి కి నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది,తద్వారా శేరిలిం గంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోకుల్ ప్లాట్స్,అయ్యప్ప సొసైటీ,సర్వే నెంబర్ 80,పాపిరెడ్డి కాలనీ ఇలా అనేక కాలనీ బస్తి ప్రజలు అక్కడ నివాసం ఉండే ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంది.

ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదు రుకోకుండా అన్ని చర్యలు అధికారులు చేపట్టాల్సిందిగా సూచించారు జగదీశ్వర్ గౌడ్ .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments