
పయనించే సూర్యుడు గాంధారి 18/01/25… గాంధారి మండలంలోని గుర్జాల్ యం పి టి సి పరిది లోని బ్రహ్మణ పల్లి గ్రామంలో గాంధారి మండల కో అర్డినేషన్ ఆద్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు తూర్పు రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోకామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి లైన్ రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంఘని బాబా,గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిస గణేష్,గాంధారి మండల కో అర్డినేటర్ నీళ్ల రవి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మణ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు & కార్యకర్తలు పాల్గొన్నారు