
పయనించే సూర్యుడు జనవరి 18 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్… అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో సి పి ఐ యంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి ముగింపు సభ గోడ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సి పి ఐ యంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా నాయకుడు కంగాల కల్లయ్య, సి పి ఐ యంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా అశ్వారావుపేట మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు లు మాట్లాడుతూ మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ జారిస్టు రష్యాలో సింబిర్క్సి అనే చిన్న పట్టణంలో 1870 ఏప్రిల్ 22 న వ్లదిమీర్ ఇల్యీచ్ ఉల్యానోవ్ ( కామ్రేడ్ లెనిన్ ) ఒక ఉన్నత మధ్యతరగతి, విద్యాధిక కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి స్కూళ్ళు ఇన్ స్పెక్టర్ గా పనిచేసేవారు. తల్లి విద్యావంతు రాలు. ఆయనకు ఒక అన్నయ్య, అక్కయ్య ఉన్నారు. వారి కుటుంబం గొప్ప సంస్కారవంతమైన ది . ఆయన అన్నయ్య కూడా విప్లవకారుడే. అయితే ఆయన విప్లవ టెర్రరిస్టు సంస్థలో సభ్యుడుగా ఉండేవాడు. ఆ సంస్థ నర్నోద్నిక్ వోల్య. అధికారులను వ్యక్తిగతంగా హతం చేయడం ద్వారా జజారిజాన్ని కూల్చగలమని భావించేది. జారును హత్య చేయడానికి ప్రయత్నించారనే అభియోగంతో లెనిన్ అన్నయ్యను జార్ పోలీసులు అరెస్టు చేసి, కోర్టు విచారణ చేయించి ఉరి తీశారు. అప్పుడు కామ్రేడ్ లెనిన్ కు 17 సంవత్సరాలు. జారిజాన్ని కూల్చివేయాలనే అన్న ఆశయాన్ని తాను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని, అయితే అన్న అనుసరించిన దారిలో కాకుండా వర్గ పోరాట మార్గంలో ఆశయాన్ని సాధిస్తానని కామ్రేడ్ లెనిన్ ఆ సమయంలో ప్రతినబూనాడు. మాట్లాడుతూ ది : 21-01-2025 మంగళవారం రోజున హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి జరిగే మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి ముగింపు సభను జయప్రదం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో పి వై ఎల్ మండల అధ్యక్షుడు బాడిస లక్ష్మణ్ రావు పార్టీ మండల నాయకులు కంగాల భూలక్మి గొంది లక్ష్మణ్ రావు పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి కంగాల కన్నయ్య గ్రామ నాయకులు సన్యాసి దుర్గయ్య తెల్లం సత్యం కారం రాజు కబ్బాడి వీరాస్వామి మడకం జోగారావు మడకం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.