
పయనించే సూర్యుడు జనవరి 17 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్… వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ (కిట్స్‌డబ్ల్యు), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెస ర్ గా పనిచేస్తున్న నాగనూరి రాజేందర్‌కు పిహెచ్‌డి డిగ్రీ సాధించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ నుండి పీహెచ్‌డీ డిగ్రీని పొందారు అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు.ఈరోజు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో, కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగనూరి రాజేందర్ పిహెచ్‌డి పరిశోధనల థీసిస్‌ను తన పిహెచ్‌డి థీసిస్‌ను యెన్ ఎఫెక్టివ్ అడాప్టివ్ గ్రాన్యులర్ స్టాటిస్టికల్ మెథడ్ అండ్ సెమాంటిక్ లీనియర్ ఆల్జీబ్రాయిక్ బేస్డ్ డైమెన్షియాలిటీ రిడక్షన్ మెథడ్ ఫర్ హై డైమెన్షనల్ డేటా అనే అంశంపై సమర్పించారని తెలిపారు.అతను హైదరాబాద్,సిబిఐటి,లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, ప్రొఫెసర్ ఎం.వేణుగోపాల చారి యొక్క సమర్థ పర్యవేక్షణలో తన పరిశోధన ను విజయ వంతంగా కొనసాగించారు. అతని పరిశోధన పని శాటిలైట్ ఇమేజెస్ వర్గీకరణ, వార్తల డేటా వర్గీకరణ,లార్జ్ లాంగ్వేజ్ మోడల్ డేటా వర్గీకరణకు వర్తిస్తుంది.ఈ విశేషమైన పరిశోధనలు డేటా వినియోగానికి సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడానికి అత్యంత లక్ష్యంగా ఉంది అని సగర్వంగా తెలిపారు. పరిశోధనా ప్రయాణంలో అతను ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలలో 2 సాంకేతిక పత్రాలను ప్రచురించారు.
ఈ సందర్భంగా ఫార్మర్ రాజ్య సభ ఎం.పి.కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి అండ్ ఫార్మర్ హుస్నాబాద్ యం యల్ ఏ కిట్స్ వరంగల్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి సంయుక్తంగా కంప్యూటర్ టెక్నాలజీ పరిశోధన రంగంలో సమాజానికి అవసరమైన పరిశోధనలు చేస్తున్నందుకు నాగనూరి రాజేందర్‌ని శుభాకాక్షలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం కోమల్ రెడ్డి, ప్రొఫెసర్ మరియు హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటి, ప్రో సెంథిల్ మురుగన్, వివిధ విభాగాల డీన్ లు అండ్ విభాగాధిపతులు. కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ డి. ప్రభాకరా చారి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటి, అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ బి. కిరణ్ కుమార్, అధ్యాపకులు మరియు సిబ్బంది పిహెచ్‌డి నీ పొందడం పట్ల నాగనూరి రాజేందర్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు.