- లేకుంటే నీ పరిస్థితి పార్టీకి అంటే ప్రమాదం ఉంది..
- పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్ధించడం సరైనది కాదు..
- ఎమ్మెల్యే లేక్క ప్రవర్తించు..
- ప్రజలంతా గమనిస్తున్నరు..
- హుజరాబాద్ ఎమ్మెల్యే అంటే నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది..
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ హుజురాబాద్ ఇన్చార్జి ప్రణవ్..
- పయనించే సూర్యడు //జనవరి 15//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓసారి మెంటల్ హాస్పిటల్ లో చూపించుకోవాలని, ఆ పిచ్చి ముదిరితే బీఆర్ఎస్ పార్టీకే నష్టమని,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించండి అని ఎద్దేవా చేశారు, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ..హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి రోజురోజుకు ముదిరిపోతుందని, హుజురాబాద్ ఎమ్మెల్యే అంటే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు నవ్వుకునే పరిస్థితి దాపురించిందని తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దాడి చేసిన తీరును యావత్ ప్రపంచం ఖండిస్తుందని, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి సహనాన్ని కోల్పోయి అలా చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సంస్కారం అని నీతులు పలికే కేటీఆర్ ఘటనను ఎలా చూస్తారు అని, దీని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. కౌశిక్ రెడ్డికి మహిళల పట్ల, నియోజకవర్గ ప్రజల పట్ల గౌరవం లేదని, రీల్స్ కోసం యాక్షన్ చేసే మహానటుడు అని అన్నారు. నియోజకవర్గ ప్రజలు అంతా గమనిస్తున్నారని, త్వరలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి గుణపాఠం తప్పదని, ఇప్పటికైనా తీరు మార్చుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం చొరవ చూపాలని ఇతవ్ పలికారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.