- సులానగర్ పీహెచ్ సి వైద్యులుడాక్టర్ వెంకటేష్ డాక్టర్ గోపి లాల్ డాక్టర్ మహమ్మద్
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు: టేకులపల్లి భారతదేశంలో క్షయ వ్యాధి నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిక్షయ్ షివిర్ కార్యక్రమం కోయగూడెం ఆశ్రమ పాఠశాల మరియు బద్ధుతండ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లోని విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయ సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది క్షయ వ్యాధిపై అవగాహన లేకపోయినా నిర్లక్ష్యం వహించినా రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో క్షయ వ్యాధిగ్రస్తులను చూడాల్సి వస్తుందని చాప కింద నీరులా వ్యాపిస్తూ అనేక మందిని కబళించే అవకాశం ఉందని ఒక్క వ్యాధిగ్రస్తుడు 15 మంది ఆరోగ్యవంతులకు ఈ వ్యాధిని అంటిస్తాడని కాబట్టి పిల్లలందరూ ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వ్యాధి లక్షణాలు 15 రోజుల మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, ఆయాసం, చంకల్లో గజ్జల్లో మెడ పైన గడ్డలు, దగ్గినప్పుడు రక్తం పడడం, లాంటి లక్షణాలు సమాజంలో ఎవరికైనా ఉంటే ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించి ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చేసే అత్యంత నాణ్యమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఒకవేళ వ్యాధి నిర్ధారణ జరిగితే అత్యంత ఖరీదైన మందులు ఉచితంగా ఇవ్వడంతోపాటు వ్యాధి పూర్తిగా తగ్గేవరకు నిపుణులైన వారితో సూచనలు సలహాలు పోషకాహార నిమిత్తం మందులు వాడే కాలానికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని ఇలాంటి సదుపాయాలు ప్రైవేట్ ఆస్పత్రిలో లభించవని కాబట్టి ఈ వ్యాధిపై సంపూర్ణ అవగాహన పెంచుకొని భారతదేశం నుండి ఈ వ్యాధి అంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సులానగర్ వైద్య బృందం పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కంచర్ల వెంకటేష్ డాక్టర్ గోపి లాల్ డాక్టర్ మహమ్మద్ సుమయ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి ఆరోగ్య విస్తరణ అధికారి దేవా ఇల్లందు టీబి యూనిట్ అధికారి శంకర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ధరణి సూపర్వైజర్ నాగుబండి వెంకటేశ్వర్లు స్టాఫ్ నర్స్ సునీత, ఏఎన్ఎంలు రమాకుమారి,వెంకటరమణ, హెడ్మాస్టర్ అమర్ సింగ్ కిషోర్ సింగ్ నాగేశ్వరరావు తారాబాయి పమిడిద్దిరాజు బాలరాజు హాము మోతిలాల్ రమాదేవి రవి వెంకటేశ్వర్లు సైదులు జానకి లక్ష్మీనారాయణ రాంబాబు మంగమ్మ హరిదాసు ఝాన్సీ రాణి, బాల విజయశాంతి తదితరులు పాల్గొన్నారు