Friday, January 31, 2025
Homeతెలంగాణగంజాయి విక్రయానికి అడ్డాగా మారిన కూకట్ పల్లి: జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

గంజాయి విక్రయానికి అడ్డాగా మారిన కూకట్ పల్లి: జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 31 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:-చాకచక్యంతో గంజాయి  విక్రయ దారులను పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ లకు అభినందనలు తెలిపిన జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఈరోజు ప్రచారమాధ్యమాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం సుమారు రెండు లక్షల విలువచేసే ఇరవై నాలుగు కేజీల గంజాయి చాక్లెట్లను రాజస్థాన్ నుండి కూకట్ పల్లి ప్రాంతమునకు అక్రమంగా తీసుకుని వస్తున్న ఉత్తర్ ప్రదేశ్ వాసిని అరెస్టు చేసినందుకు అభినందిస్తూ , ఇటీవల కూకట్ పల్లి నియోజకవర్గంలో అధికంగా గంజాయి విక్రయం జరుగుతుందని వార్తలు వచ్చాయి . పాఠశాల దశలోనే యువత గంజాయి మత్తులో పడడం చాలా బాధాకరంగా ఉందని , యువత భవిష్యత్తు యమగండం గా మారుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను , పాఠశాలలు మరియు కాలేజీల ఉపాధ్యాయులు తమ విద్యార్థులను జాగ్రత్తగా గమనిస్తుండాలని , ముఖ్యంగా హాస్టల్ నిర్వాహకులు తమ హాస్టల్లో ఉంటున్న యువతీ , యువకులను పరిశీలిస్తుండాలని , నేటి యువత రేపటి దేశ భవిష్యత్తు అని యువత భవిష్యత్ కాపాడుట తల్లిదండ్రుల తో పాటు ప్రజలందరిదీ అని గంజాయి సేవించిన మరియు విక్రయించిన వారిపై పోలీసు అధికారులు కఠిన చర్య తీసుకోవాలని ప్రేమ కుమార్  కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments