
( పయనించే సూర్యుడు జనవరి 17 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )… ఈ రోజు గుడిమల్కపూర్ మార్కెట్ యార్డు నందు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హజరయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ…నాలుగు సంవత్సరాల తరువాత పాలక మండలిని నియమించడమే కాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ గా బీసీ బిడ్డలను నియమించడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు. మార్కెట్ కు వచ్చే పేద రైతులకు మార్కెట్ కమిటీ సొంత లాభాలతో మధ్యాహ్నం భోజనం కల్పించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, మక్తల్ శాసన సభ్యులు వాకాటి శ్రీహరి,లైబ్రరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.