
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
పయనించే సూర్యుడు జనవరి 17 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా… గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా నెరవేరుస్తున్నామని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూరు మండలంలోని దంతన్ పల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు ప్రతి గ్రామంలో రోడ్డు,డ్రైనేజీ,నీటి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని పక్కగా అమలు చేస్తున్నామని తెలిపారు గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంతరావు,ఆర్టీఎ జిల్లా సభ్యులు దూట రాజేశ్వర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఉట్నూర్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యుం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్,మాజీ సర్పంచ్లు భీమన్న,జగదీష్, కాంగ్రెస్ నాయకులు దాసండ్ల ప్రభాకర్,రాజేష్, మహేందర్, గ్రామ పటేల్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.