పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి: ప్రముఖ సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త, యువ నాయకులు నిజాంపేట్ వాస్తవ్యులు అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం ఉదయం మైసిగండి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆలయ ప్రాంగణంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బీసీ సంక్షేమ సంఘం, బీసీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ పాల్గొని శాలువా తో సత్కరించి, తిరుమల తిరుపతి దేవస్థానం డైరీని, పూల మొక్కను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వారితోపాటు వలండి బీమా గౌడ్, స్వరూప్, అట్ల వెంకటరెడ్డి, రోహిత్ చందు, గంట విశాల్ కుమార్, పేరూరి జయ సాయి కృష్ణ సీనియర్ పాత్రికేయులు చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.