పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 1 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్: మండల కేంద్రమైన చేగుంట లో మార్కండేయ జయంతిని పురస్కరించుకొని మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పద్మశాలి సంఘం వద్ద పతాకావిష్కరణ చేసి మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంఘ0 నుండి బస్టాండ్ వరకు భక్తిశ్రద్ధలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు మ్యాకల రవి, ఉపాధ్యక్షులు నాగులు, సంతోష్, సతీష్, భూములు, రాజు, అనిల్ తుమ్మ చంద్రమోళి, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు
RELATED ARTICLES