
పయనించే సూర్యుడు జనవరి 30 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి
అహింసా వాదంతో ఎంతటి కఠిన లక్ష్యాన్ని అయినా చేదించవచ్చు అని నిరూపించి ఆంగ్లేల చేర నుండి అఖండ భారతావనికి విముక్తి కలిగించి ప్రపంచానికి నూతన పోరట వరవడిని నేర్పించిన మహానీయుడు జాతిపిత మహాత్మా గాంధీ : జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు కే పి హెచ్ బి కాలనీ ఐదవ వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీసులో కూకట్ పల్లి నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని
గాంధీజీ చిత్ర పటమునకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,మహాత్ముని మార్గం యువకులకు ఆదర్శనీయమని అహింసా మార్గంలో పరదేశిలను పాలన నుంచి ముక్తి కలిగించిన మహనీయుడు అని , సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి యావత్ భారత జాతికి స్వేచ్ఛను అందించిన వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు . ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి జనసేన పార్టీ నాయకులు వేముల మహేష్, కొల్లా శంకర్, పసుపులేటి ప్రసాద్ , కలిగినిడి ప్రసాద్, సలాధి శంకర్,దాసరి వెంకట్, పోలిబోయిన శ్రీనివాస్, పాదం సూర్య, మండల రమేష్ , ఆవుల రంగబాబు , నామన రాజు, పులగం సుబ్బు, రాము , శ్రీనివాస్ రావు మరియు వీర మహిళలు అల్లంశెట్టి భాగ్యలక్ష్మి,జి.స్వప్న పాల్గొన్నారువీర మహిళలు పాల్గొన్నారు