
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 7 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : బాలనగర్ లో ఎన్నో ఏళ్లుగా ఉన్నత పాఠశాల భవనం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచి గ్లాండ్ ఫార్మా కంపెనీ సహకారంతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, గ్లాండ్ ఫార్మా డైరెక్టర్ రఘురామన్ మరియు వైస్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బాలనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గ్లాండ్ ఫార్మా వారు నిర్మాణం చేపట్టారన్నారు. గ్లాండ్ ఫార్మా సంస్థ యాజమాన్యం సేవా దృక్పథంతో ముందుకు వచ్చి నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచినందుకు వారికి శాలువాతో సన్మానం చేశారు. ప్రభుత్వం పిల్లల పట్ల శ్రద్ధ చూపకపోయినా సేవా దృక్పథంతో నిర్మాణం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు