
పయనించే సూర్యుడు( ప్రతినిధి) ఫిబ్రవరి10 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం *అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండల కేంద్రానికి* సమీపంలో ఉన్న *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో* *రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్* మరియు కూటమి నేతలు కలిసి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీయే కూటమి ప్రభుత్వం తలపెట్టిన *శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకానికి* సంబంధించి విద్యార్థినీ విద్యార్థులతో రోజు వారీ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం మరియు త్రాగడానికి మంచి నీరు వంటి సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయ లేదని పరిశీలించారు. తదనంతరం మరుగుదొడ్లు వసతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థినీల విద్యార్థులు మాటల్లో త్రాగడానికి ఆర్ ఓ ప్లాంట్ లేనందున స్వచ్ఛమైన శుద్ధి నీరు లేక త్రాగునీటి సమస్యలు మరియు ప్రస్తుత మరుగుదొడ్ల డోర్ల రిపేర్లతో పాటుగా అధిక విద్యార్థినీ విద్యార్థులు ఉనందువలన నూతనంగా మరిన్ని పెంచాలని కోరగా అక్కడికక్కడే రామ శ్రీనివాస్ సంబంధిత శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులతో అక్కడ ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకుని వెంటనే పరిస్కారం కోసం క్షుణ్ణంగా మాట్లాడగా అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బీజేపీ మండల అధ్యక్షులు యస్ వి రమణ గౌడ, కృష్ణా రెడ్డి చెరువు నీటి సంగం అధ్యక్షులు టి.ఆనందరెడ్డి,జనసేన నాయకులు జి.శ్రీనివాసరాజు,ప్రతాప్ రెడ్డి తదితర కూటమి నాయకులు జనశైనికులు పాల్గొన్నారు.