
సబ్ టైటిల్.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ గిరిబాబు రోజురోజుకు పేట్రేగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరువూరు సిఐ గిరిబాబు తెలిపారు. పయనించే సూర్యుడు జనవరి ఏడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. నేరాలను అరికట్టే దానిలో భాగంగా గ్రామ గ్రామాన పర్యటించి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం రాత్రి గంపలగూడెం-తోట మూల, గాదెవారిగూడెం గ్రామాల్లో పర్యటించి, సదస్సులు నిర్వహించారు. స్థానిక ఎస్సై ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుల్లో సిఐ గిరిబాబు మాట్లాడుతూ, సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని వివరించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా వాడుకున్నట్లయితే నేరాలను నియంత్రించే అవకాశం మెండుగా ఉంటుందన్నారు. అలాగే దుకాణాల్లో ప్రతి యజమాని కెమెరాలను వాడాలని ప్రజల భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రదేశాల్లో ఈ సీసీలను ఏర్పాటు చేయుటకు సహకరించాలని ఉద్ఘాటించారు.వీటి ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గాదేవారిగూడెం సర్పంచ్ చెన్న శ్రీనివాసరావు గ్రామపంచాయతీ సభ్యులు ఏఎస్ఐ రమేష్ బాబు, సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు..