అయన మరణం వామపక్ష ఉద్యమాలకు తీవ్రని లోటు
సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి .
పయనించే సూర్యుడు( న్యూస్) జనవరి15 మక్తల్( రిపోర్టర్ సి తిమ్మప్ప )..తన తుది శ్వాస వరకు కార్మిక, కర్షక, ప్రజల పక్షాల నిలబడి పోరాడిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ కొండన్న అని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి అన్నారు బుధవారం రోజు మక్తల్ మండల పరిధిలోని దాసర్ దొడ్డి గ్రామంలో అనారోగ్యంతో సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొండన్న మంగళ వారం రోజు చనిపోయారు. కామ్రేడ్ కొండన్న భౌతిక కాయం సందర్శించి నివాళులర్పించారు.
కొండన్న తన జీవిత సర్వస్వం ప్రజల కోసం దార పోసి పనిచేసిన త్యాగశీలి అని అన్నారు తాడిత పీడిత ప్రజల పక్షాన పోరాడారు. దోపిడి రాజ్యం నశించాలని కార్మిక ,కర్షక రాజ్యం సోషలిజం వర్ధిల్లాలని కలలుగన్న కమ్యూనిస్టు కామ్రేడ్ కొండన్న అనీ కొనియాడారు. మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి ఉద్యమాల నుంచే కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలకు ఆకర్షితులై విద్యార్తి,యువకులను చైతన్య పరచారని గుర్తు చేశారు .
నేడు జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి. పనిచేస్తూ కార్మిక ప్రజాక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తూ ఉన్న సమయంలోనే అనారోగ్యానికి గురై మరణించడం చాలా బాధాకరమని అన్నారు. కామ్రేడ్ కొండన్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గోపాల్ బలరాం పుంజానూర్ ఆంజనేయులు మంజులయ్య గౌడ్ సిపిఎం జిల్లా నాయకులు భరత్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ బాలప్ప గోవిందరాజ్ జిల్లా నాయకులు మహేందర్ తదితరులు ఉన్నారు