

పయనించే సూర్యుడు/జనవరి 19/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్… నేడు టీడీపీ వ్యవస్థాపకుడు,దివంగత మాజీ ముఖ్య
మంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు..ఈ సందర్భంగా తాళ్లూరి అప్పారావు మాట్లాడుతూ..తెలుగు భాషకు,తెలుగు
వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని,నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి ఎంతోమందికి దైవంలా నిలిచారు,ఆయన మరణించి
కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజ యాలు,చేసిన మంచి పనులు చేసిన సేవలను కొనియాడారు టిడిపి జిల్లా అధ్యక్షులు తాళ్లూరి అప్పారావు ఏన్కూరు మండలం అధ్యక్షులు కొనకంచి రామకృష్ణ మాజీ జెడ్పిటిసి ఆరెం లక్ష్మి పొన్నం హరికృష్ణ జనార్ధన్ సాయిల నాగయ్య మాదినేని అశోక్ అరెం రామయ్య కోపెలా శ్యామల నామ వెంకయ్య టిడిపి కార్యకర్తలు అన్నగారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు