
పయనించే సూర్యుడు/జనవరి 21/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
తుక్కుగూడ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కంబాలపల్లి రాములుపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంబాలపల్లి రాములు పై పాఠశాల ఆవరణంలో దాడి చేసి విధులకు ఆటంకం కలిగించిన అరాచక మొక్కలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మారావుపేట, బురద రాఘవాపురం, ఏన్కూరు, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారం పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరావు మాట్లాడుతూ గత నెల 21న సాయంత్రం పాఠశాల ఆవరణంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధన చేస్తున్న క్రమంలో ప్రధానోపాధ్యాయులు కె.రాములు మోకాలు పొరపాటున అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థికి తగిలింది అనే కారణంతో అదే నెల 23న ఉదయం 11 గంటల సమయంలో పాఠశాలకు ఏమాత్రం సంబంధం లేని అరాచక శక్తులు సుమారు 50 మంది పాఠశాలలోనికి చొరబడి హెచ్ఎం కె.రాములపై దాడి చేసి అసభ్యకర పదజాలంతో దూషించడంతోపాటు విచక్షణరహితంగా కొట్టారని తెలిపారు. పాఠశాల విధులకు ఆటంకం కల్పించడం మే కాకుండా కార్యాలయంలోని ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారని పేర్కొన్నారు.పాఠశాల ఆవరణంలో దాడి చేసి విధులకు ఆటంకం కలిగించిన అరాచక ముక లపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ఉపాధ్యాయులపై అరాచక శక్తులదాడులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమంలో టీఎస్ యూటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు రాంచంద్,మూడ్ పుల్లయ్య ఉపాధ్యక్షులు శ్రీదేవి, జె. పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు, బి.శోభన్, శంకర్రావు, రాఘవరావు, డి నరసింహారావు హీరాలాల్, రమేష్, వసంత, సోనా భాయి, స్వర్ణ కుమారి, కుమారస్వామి, శ్రీ వేణు, సాజిత బేగం,డి. శ్రీనివాసరావు, ఏ.భారతి, విజయ శ్రీ, టి.నరేష్ ఇస్మాయిల్, రాజు, భావ్ సింగ్, హెచ్.భాస్కర్, బి. నవ్య, సింగ్యా, రవి, శ్యామల, శ్రీరామ్, వెంకటరమణ, రమేష్, జె.నాగేశ్వరరావు,ఉషశ్రీ, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.