- రూ. 30,000 నగదు అందజేత సంతోషం వ్యక్తం చేసిన టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు
(పయనించే సూర్యుడు జనవరి 15 రిపోర్టర్ రవీందర్ ) సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా బహుమతు లకు అందించే నగదు రూ. 30,000 లను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి క్రీడా నిర్వాహకులకు అందజేశారని గ్రామ మాజీ ఉపసర్పంచ్ శివ కుమార్ యాదవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పనితీరును గ్రామ క్రీడాకారులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో కుమార్ యాదవ్,కుమ్మరి గిరి,రవిముదిరాజ్, చాట్ల శివ టోర్నమెంట్ నిర్వాహకులు గడిగే మహేందర్ గౌడ్, కారె ప్రకాశ్ యాదవ్,ఖాజా పాషా, గ్రామ క్రీడాకారులు పాల్గొన్నారు.
దూసకల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆర్థిక సాయం
RELATED ARTICLES