
పయనించే సూర్యుడు “ఫిబ్రవరి 15: ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, ఆదోని గ్రామీణ యువత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి చేసిన ఫిర్యాదు మేరకు స్పందించిన లోకేష్ ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలోని ఉన్నత పాఠశాల పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికల జరపాలని అధికారులను ఆదేశించడం జరిగింది. వైసీపీ నాయకుల తెరవెనుక రాజకీయాలతో ఆగిపోయిన ఎస్ఎంసి ఎన్నికలు, కుంటుపడిన పాఠశాల అభివృద్ధి. మంత్రి లోకేష్ ఆదేశాలతో సంతెకుడ్లూరు గ్రామ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమైన ఆదోని మండల విద్యాధికారులు.ఎన్నికల విషయాన్ని ఆదోని మండల విద్యాధికారి శ్రీనివాసులు తో పాఠశాలలో చర్చించిన ఎమ్. హెచ్. పి.ఎస్. సంతెకుడ్లూరు గ్రామ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్, సలహాదారులు కుబేర స్వామి, ఎంహెచ్పిఎస్ కార్యకర్తలు మరియు టిడిపి నాయకులు.ఫిర్యాదుకు వెంటనే స్పందించి సంతేకుడ్లూరు గ్రామ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఎంహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారుఖ్ షుబ్లీ కి కృతజ్ఞతలు తెలిపిన సంతేకుడ్లురు ఎంహెచ్పీఎస్ నాయకులు టిడిపి నాయకులు మరియు గ్రామ ప్రజలు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కేశప్ప, మల్లికార్జున, బిజెపి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.