Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ తో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చర్చ

నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ తో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చర్చ

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ (జనవరి.28/01/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్:- మంగళవారం తిరుపతి లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తో పాటు పలువురు శాఖధిపతులను ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు,  గత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు వంతెనలు మరమ్మత్తు పనులు చేపట్టాలని, మంజూరైన పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులు త్వరగా విడుదల చేయాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు.
అరణియార్ లో 10 లక్షలు చేప పిల్లలు వదిలే అంశంపై కలెక్టర్ తో చర్చించగా వెంటనే అంగీకరించి ఫిబ్రవరి నెల 2వ తేదీ తరువాత వదులుకోవచ్చని కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
సమస్యలు పరిష్కారం కోసం ఒకరోజు నియోజకవర్గంలోని ఏదైనా మండలంలో సమీక్ష సమావేశం నిర్వహించాలని కలెక్టర్ ను ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే వివరించారు. అక్కడ నుండి జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకొని నియోజకవర్గంలో మూడియూర్, చామర్తి కండ్రిగ లకు మంజూరైన రెండు విద్యుత్ సబ్ స్టేషన్ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ఆ శాఖ ఎస్.ఈ ని కోరారు.
వీటితో పాటు వివిధ శాఖల అధిపతులను ఎమ్మెల్యే కలిసి వారి శాఖలకు సంబందించిన సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. తన వినతులకు జిల్లా కలెక్టర్ తో పాటు అన్నీ శాఖల ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments