
పయనించే సూర్యడు జనవరి 17 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు… శ్రీరంగాపురంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నడిగూడెం సహకార సంఘం చైర్మన్ కొల్లు రామారావు శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది స్థానిక రైతులు పాల్గొన్నారు.