
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతి నీధి
సుమధుర స్వరం,వినసొంపైన గానంతో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఏకత్వా పాఠశాల విద్యార్థులు. గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి బాలోత్సవ వేదికపై సుమధుర స్వరాలు పలికించి, సంగీత ప్రియుల మదిని మెప్పించి పాటల పోటీలలో ఏకత్వ పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని, అలాగే వ్యాసరచన వ్యక్తిగత పోటీలలో చర్విత్ సాయి తృతీయ స్థానంలో నిలిచాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడపా నాగ సూర్యవతి తెలిపారు. ఈ సందర్భంగా కంచికచర్ల మండలం కంచికచర్ల గ్రామంలోని ఏకత్వా పాఠశాలలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ అమరనేని సింధూర పాల్గొని పాటల పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా సింధూర మాట్లాడుత తమ పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులు ఆట పాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొని విజేతలుగా నిలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సంగీత అధ్యాపకులు తేరా రాహులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.