పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 15 మామిడిపెల్లి లక్ష్మణ్ పసుపు బోర్డు ఏర్పాటు పట్ల బిజెపి నాయకుల హర్షం.
రాయికల్ మండలంలోని రామాజి పేట్ గ్రామంలో దేశ ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ ధర్మపురి చిత్ర పటానికి బిజెపి నాయకులు క్షీరాభిషేకం చేశారు.నిజమా బాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నెరవేర్చారు అని అన్నారు.పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు గిట్టబాటు ధర లభిస్తుందని,ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు కు కృషి చేశారని అన్నారు.అనంతరం రైతుల ఆధ్వర్యంలో మోడీ,అరవింద్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో లో మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్,భూపతి పూర్ సింగిల్ విండో అధ్యక్షులు ఏనుగు ముత్యం రెడ్డి,సీనియర్ నాయకులు చిట్యాల లక్ష్మణ్,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు,మాజీ ఉప సర్పంచ్ కుర్మా లింగారెడ్డి, నాయకులు కోల శంకర్,గుర్రు మల్లారెడ్డి,భోయిని నరేందర్, ఐండ్లేని ఎర్ర రెడ్డి,కంటే భూమేశ్,నేతుల తిరుపతి, ఇద్దం స్వామిరెడ్డి,గోనె రాములు,గడ్డం మల్లారెడ్డి,శేఖర్,నర్సారెడ్డి,ప్రసాద్,మహేష్,నరేష్,రాజ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.