
పయనించే సూర్యుడు జనవరి 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం చేజెర్ల . మండపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి శశిధర్ బుధవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎలుకల వలన వరి పంట లో చాలా నష్టం జరుగుతుందని తెలిపారు. దాని నివారణ కొరకు సామూహిక ఎలుకల నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. దీనికి ప్రభుత్వం ఉచితంగా బ్రోమోడైలీన్ మందు ఇస్తుందని అది ఎలా పెట్టాలో డి ఈ ఎం ఓ చూపించారు.అనంతరం రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ లక్ష్మీ నరసా రెడ్డి , వి ఏ ఏ. మమత. వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు