
బచ్చన్నపేట సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్
జనవరి 18 పయనించే సూర్యుడు బచ్చన్నపేట జనగామ జిల్లా… బచ్చన్నపేట మండలం లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలను గ్రామ ప్రజలు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలకు వెళ్లకుండా సరైన వసతులు కల్పించామని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు సురక్షితంగా జరుగుతాయని ప్రసవాలకు వచ్చిన గర్భిణి మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని బచ్చన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నార్మల్ ప్రసవాలు జరిగాయి అని,అవి పోచన్నపేట గ్రామానికి చెందిన నల్ల రజిత, నాగిరెడ్డిపల్లి చెందిన బండి కవిత, బచ్చన్నపేట గ్రామానికి చెందిన బండారి కవితలకు సురక్షితంగా ప్రసవాలు జరిగాయి అని తెలిపారు ప్రసవాలు నిర్వహించడానికి డాక్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారని మరియు మండల ప్రజలకు 108 అంబులెన్స్ వాహనం 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయని, మండల ప్రజలు ఈ వైద్య సేవలను అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బచ్చన్నపేట సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సృజన,ఆదిలక్ష్మి,డాక్టర్ దీప్తి,అరుణ కుమార్, కొంటీ సరూప్,స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.