
పయనించే సూర్యుడు గాంధారి 29/03/25 ఈరోజు MEO ప్రాథమిక పాఠశాల బాలికల గాంధారిని ప్రార్థన సమయానికి సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతిరోజు పిల్లలందరూ తప్పకుండా పాఠశాలకు ప్రార్థన సమయానికి హాజరు అవ్వాలని తెలియజేస్తూ మరియు వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా పలు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది.అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై FA4, FLN అంత్య పరీక్షల యొక్క ప్రగతిని విద్యార్థుల వారిగా ఆన్లైన్లో నమోదు చేయాలని తెలియజేస్తూ అలాగే పాఠశాలకు వచ్చిన నిధులను స్టాఫ్ మీటింగ్ నిర్వహించి ప్రతి ఉపాధ్యాయులతో చర్చించి NORMS ప్రకారం తీర్మానాలను రిజిస్టర్లు రాస్తూ పాఠశాలకు నిధులు ఖర్చు చేయాలని సూచించడం జరిగింది. మరియు ప్రార్థన నిర్వహించే విధానం గురించి ఉపాధ్యాయులకు సూచనలు చేయడం జరిగింది.