( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్ )
పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ ఆయన సతీమణి ప్రొఫెసర్ వనమాల తదితరులను విజ్ఞాన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం సన్మానించింది. విద్యార్థి డిగ్రీ కళాశాల యాజమాన్యం భవాని శంకర్, విశ్వనాథం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, నిజ లింగం తదితరులు శాలువాలతో వారిని సన్మానించారు. మొగలిగిద్ద 150 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకకు సంబంధించి కళాశాల ఆవరణలో ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు స్థానిక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాలలో మొలిగిగిద్ద పూర్వ విద్యార్థి భవాని శంకర్ ఇంకా తదితరులు మొగిలిగిద్ద గ్రామ పెద్దలు ఇంకా పలువురు పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం కళాశాల డైరెక్టర్ మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ మరియు కళాశాల డైరెక్టర్ భవాని శంకర్ విశ్వనాథ్ రఘు నిజ లింగం తదితరులు పెద్ద ఎత్తున వారిని సన్మానించారు.