
1).చిక్కడపల్లిలో బాధిత కుటుంబాన్ని పమర్శిస్తున్న ఎన్ఆర్ఐ కోనేరు శాశంక్..
2). అంబం గ్రామంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఎన్ఆర్ ఐ కోనేరు శశాంక్..
రుద్రూర్, మార్చ్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండలంలోని చిక్కడ్ పల్లి గ్రామ బూత్ అధ్యక్షుల భార్య కుమారుడికి, రుద్రూర్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు గుడిసె ప్రభాకర్ కి కారు ప్రమాదంలో గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్ వారి ఇంటికి వెళ్లి శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 25 కేజీల బియ్యము, ఒకొక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా అంబం గ్రామంలో నిన్న అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరి ఇంటి పెద్దలు లేని మహిళల ఇల్లులు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఈ విషయం అంబం గ్రామ బీజేపీ కార్యకర్తలు కోనేరు శశాంక్ కు తెలియజేయడంతో, కోనేరు శశాంక్ బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, దైర్యం చెప్పి వారి రెండుకుటుంబాలకి 25 కేజీల బియ్యము, ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ఉపాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఏముల గజేందర్, సాయినాథ్, సున్నం సాయిలు, గంగాధర్, రేపల్లి సాయిప్రసాద్, శానం బాలాజీ, బూత్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
