Thursday, May 1, 2025
Homeతెలంగాణబిఆర్ఎస్ పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ...

బిఆర్ఎస్ పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు 20 రిపోర్టర్ రమేష్ నాయక్ మున్సిపాలిటీలో గ్రామాల విలీన ప్రక్రియ ప్రజల అభిప్రాయంతో జరగలేదుఏకపక్షంగా గెజిట్ విడుదల చేసి బలవంతంగా గ్రామాలను విలీనం చేశారు విలీన గ్రామాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలతో ప్రభుత్వ0 చర్చించలేదుకాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపోయి ప్రజలను ముఖ్యంగా సామాన్యులను వేధిస్తున్నారు
ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నది వారే కాపాడుతామంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నది వారే400 రోజులు గడిచిన నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు రాలేదునిరుపేదలకు అసలైన అర్హులకే పథకాలు అందించాలి కాంగ్రెస్ పార్టీ కోటాలు వాటాలు ఉంటే గ్రామ సభలలో నిలదీయండి గత ప్రభుత్వంలో మంజూరైన గృహలక్ష్మిఇండ్లను కోర్టు అర్హులుగా తేల్చినట్లయితే వారికి కూడా ప్రభుత్వం అందించాలికాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామిలపైనా నిరసన కార్యక్రమాలు దశలవారీగా చేపట్టాలినర్సంపేట మున్సిపాలిటీలో మనం తెచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నవి రేపు ఆ పనులే మనల్ని గెలిపిస్తాయి గెలిచిన ఎమ్మెల్యే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి వద్ద నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మున్సిపాలిటీ అభివృద్ధి గురించి కానీ మాట్లాడలేదు
సొంత ఏజెన్సీ కాంట్రాక్టు పనుల కోసం నిధులను రద్దుచేసి పనులను మారుస్తున్నారు..
సంవత్సర కాలం గడిచిందిమీ పనితీరుఏంటోతెలిసిపోయిందికాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి కార్యకర్తలేఈరోజుమిమ్మల్నితిట్టుకుంటున్నారునర్సంపేట మీద మీకు ఉన్న ఆలోచన విధానాలను చూసినిరుపేద ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా 7 కోట్లు పెట్టీ ఏసీ ఫంక్షన్ హాల్ కడితే దాని ముఖం కూడా చూడాలేదు దాని మీద ఎప్పుడు సమీక్ష కూడా నిర్వహించలేదు అని చెప్పడం సిగ్గుచేటునేనుశాసనసబ్యునిగా నియోజకవర్గ అభివృద్ధి మీద దూరదృష్టి పెట్టి ఒక గొప్ప విజన్ తో పనిచేసేనా
ఏ పార్టీ వారైనా క్యాంప్ ఆఫీస్ మెట్లు ఎక్కిన పార్టీలు అనే భేదం లేకుండా వారికి నాకు తోచినవిధంగాసహాయసహకారాలుఅందించేవాడినమీరు గ్రామ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా 9 గ్రామాలు విలీనం చేస్తూ గెజిట్ విడుదలు చేయడం ద్వారాఈరోజు గ్రామ ప్రజలు ఉపాధి హామీ పథకం కోల్పోతారు.. తద్వారా వ్యవసాయరంగం & కూలి పనులు చేసుకు నేవారు తీవ్రగా నష్టం పోయే అవకాశం ఉందిఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర మాజీ డైరెక్టర్, మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ, క్లస్టర్ బాధ్యులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, యూత్ అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, మహిళ కమిటీ బాధ్యులు, పట్టణ కమిటీ బాధ్యలు, విలీన గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments