ఫోటో : సన్మానిస్తున్న దృశ్యం…
రుద్రూర్, జనవరి 17 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో గురువారం రాత్రి 7 గంటలకు పోలీసుల బృందం ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు, మూఢ నమ్మకాల వంటి అంశాల పై ప్రజలకు నాటికను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగహన కల్పించారు. అనంతరం నూతనంగా పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయన్న, ఏఎస్ ఐ రాజు, మాజీ జడ్పిటీసి నారోజి గంగరాం, సురేష్ పటేల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు