
లబ్దిదారులకు అవగాహన కల్పించే దిశగా అడుగులు..
//పయనించే సూర్యుడు //న్యూస్// ఫిబ్రవరి9 మక్తల్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా లబ్దిదారులకు అవగాహన కల్పించేందుకు ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదేశాలతో హౌసింగ్ అధికారులు స్థలానికి మార్కింగ్ వేయడం జరిగింది , నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ప్రాంగణంలో నమూనా ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దాదాపు 45 గజాల్లో ఒక బెడ్ రూమ్, హల్, కిచెన్, బాత్ రూమ్, టాయిలెట్ ఉంటాయని చెప్పారు. ఈ సదుపాయాలకు తక్కువ కాకుండా చూసుకోవాలని, ఎక్కువ ఉండవచ్చని అన్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్దిదారులకు ఇంటిని చూపించి, ఇదే తరహాలో కట్టుకునేలా ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి నమూనా ఇంటిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న హౌసింగ్ అధికారులు శంకర్ పిడి&హరికృష్ణ డి ఈ మరియు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఏ.రవికుమార్, గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.